నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

  • తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • టోల్‌గేట్ సూచిక బోర్డును ఢీకొట్టిన కారు
  • ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం
  • ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌గేట్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారు, టోల్‌గేట్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న సూచిక బోర్డును వేగంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే కారు వేగం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Road Accident
nallajerla mandal
East Godavari District

More Telugu News